రేపు హైదరాబాదులో యువ సంఘర్షణ సభ... హాజరవుతున్న ప్రియాంక గాంధీ
- సరూర్ నగర్ స్టేడియంలో నిరుద్యోగుల బహిరంగ సభ
- రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు శంషాబాద్ చేరుకోనున్న ప్రియాంక
- ప్రత్యేక హెలికాప్టర్ లో సరూర్ నగర్ పయనం
- సరూర్ నగర్ సభలో యూత్ డిక్లరేషన్ ప్రకటించనున్న ప్రియాంక
ప్రియాంక రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు శంషాబాద్ చేరుకుంటారు. అక్కడ్నించి ప్రత్యేక హెలికాప్టర్ లో సరూర్ నగర్ పయనమవుతారు.
సాయంత్రం 4.30 గంటలకు సరూర్ నగర్ సభలో ప్రియాంక ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు ప్రియాంక గాంధీ సభ నుంచి తిరుగు పయనమవుతారు.
ప్రియాంక పర్యటనపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. రేపటి నిరుద్యోగుల బహిరంగ సభలో ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారని వెల్లడించారు.