స్పిన్నర్ 152 కి.మీ వేగంతో బంతి వేశాడా? నిజమేనా?
- నిన్న సీఎస్కే, ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన
- తీక్షణ 152 కి.మీ. వేగంతో బంతి వేసినట్టు చూపెట్టిన వైనం
- స్పీడో మీటర్ తప్పిదంపై సోషల్ మీడియాలో జోక్స్
అంత వేగంతో బౌలింగ్ చేసే పేసర్లు కూడా ఇద్దరు ముగ్గురే ఉన్నారు. దాంతో, స్పీడో మీటర్ తప్పిదం వల్లనే 152 కి.మీ స్పీడు అని నమోదైందని తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన మిమ్స్, జోక్స్ నడుస్తున్నాయి. గతంలో కూడా స్పీడో మీటర్ బంతి వేగాన్ని తప్పుగా చూపెట్టిన ఘటనలు ఉన్నాయి. ఈ క్రమంతో నిన్నటి మ్యాచ్ లో ఉపయోగించిన స్పీడో మీటర్ ను నాప్తాల్ వెబ్ సైట్ లో కొన్నారని, అది పాకిస్థాన్ మీటర్ కావొచ్చని నెటిజన్స్ జోక్స్ పేలుస్తున్నారు. స్పీడో మీటర్ మందు తాగినట్టుందంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.