BJP: వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ ఛార్జిషీట్

AP bjp chargesheet on YSRCP government
  • ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిందన్న బీజేపీ  
  • వైసీపీ నేతలు, ఇసుక బకాసరుల స్వార్థంతో ప్రజల ప్రాణాలు పోయాయని వ్యాఖ్య
  • సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా అన్నమయ్య ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావించింది. అన్నమయ్య ప్రాజెక్టు 2021 నవంబర్ 19వ తేదీన కొట్టుకు పోయిందని బీజేపీ గుర్తు చేసింది. ఇసుక మాఫియా కారణంగా అధికారులు కుమ్మక్కు కావడంతో ఈ దుర్ఘటన జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు నీటి ప్రవాహనంలో పడి కనీసం 33 మంది చనిపోయారని, వైసీపీ నేతలు, ఇసుక బకాసురుల స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలు ప్రాణాలను అధికారులు బలి పెడుతున్నారన్నారు. దీనికి సంబంధించి బాధ్యులను గుర్తించి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
BJP
Andhra Pradesh
YS Jagan
YSRCP

More Telugu News