Shahrukh Khan: షారుఖ్ 'జవాన్' రిలీజ్ డేట్ ఖరారు!

  • షూటింగు దశలో షారుఖ్ 'జవాన్'
  • సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న భారీ సినిమా 
  • కీలకమైన పాత్రలో నయనతార 
  • సెప్టెంబర్ 7వ తేదీన సినిమా విడుదల  
Jawan movie release date confirmed

షారుఖ్ ఖాన్ 'పఠాన్' సృష్టించిన ప్రభంజనంతో మంచి ఉత్సాహంతో ఉన్నారు. ప్రస్తుతం ఆయన దృష్టి అంతా కూడా అట్లీకుమార్ రూపొందిస్తున్న 'జవాన్' పైనే ఉంది. ఈ కథపై చాలా రోజుల పాటు గట్టి కసరత్తు జరిగిన తరువాతనే షారుఖ్ ఈ ప్రాజెక్టు చేయడానికి అంగీకరించారు. ఈ సినిమా ఆయన సొంత బ్యానర్లో నిర్మితమవుతోంది. 

ఈ సినిమా రిలీజ్ డేట్ ను కొంతసేపటి క్రితమే ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన విడుదల చేయనున్నారు. షారుఖ్ కెరియర్ లోనే ప్రత్యేకమైన స్థానంలో నిలిచేలా అట్లీకుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ఈ సినిమాకి, అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

ఈ సినిమాలో నయనతార .. విజయ్ సేతుపతి ... ప్రియమణి .. యోగిబాబు ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. సంజయ్ దత్ ... విజయ్ .. అల్లు అర్జున్ .. దీపిక పదుకొణే అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. చాలా కాలంగా ఈ ప్రాజెక్టుపైనే కసరత్తు చేస్తూ వచ్చిన అట్లీ కుమార్, ఏ రేంజ్ హిట్ ను అందిస్తాడనేది చూడాలి.

More Telugu News