ఖర్గేను చంపాలని చూస్తున్నారు.. బీజేపీపై రణ్ దీప్ సూర్జేవాలా సంచలన ఆరోపణ
- చిత్తాపూర్ బీజేపీ అభ్యర్థి రాథోడ్ ఈ కుట్ర పన్నారని వెల్లడి
- రాథోడ్ మాట్లాడిన ఆడియో క్లిప్ లభ్యమైందని వివరణ
- ప్రియాంక్ ఖర్గేపై పోటీపడుతున్న మణికంఠ రాథోడ్
చిత్తాపూర్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే పోటీ చేస్తున్నారు. ప్రియాంక్ ఖర్గే బరిలో ఉండడంతో తాను ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదని రాథోడ్ కు అర్థమైందని సూర్జేవాలా మీడియాకు చెప్పారు. దీంతో ప్రియాంక్ పై ద్వేషం పెంచుకుని హత్యకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు రాజకీయంగా దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కన్నడ ప్రజలు తమ పార్టీపై చూపిస్తున్న ప్రేమను బీజేపీ నేతలు తట్టుకోలేక పోతున్నారని సూర్జేవాలా ఆరోపించారు.