Chandrababu: ​​​​​​​ప్రభుత్వానికి ఇదే డెడ్ లైన్: చంద్రబాబు

  • తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరామర్శ
  • రాజమండ్రిలో చంద్రబాబు మీడియా సమావేశం
  • తాను పర్యటన పెట్టుకున్న తర్వాతే అధికారుల్లో చలనం వచ్చిందని వెల్లడి
Chandrababu fires on AP Govt

తూర్పు గోదావరి జిల్లాలో అకాల వర్షాలకు పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు పర్యటించారు. చేతికొచ్చిన పంట కోల్పోయి దిగాలు పడిన రైతన్నలను పరామర్శించారు. అనంతరం రాజమహేంద్రవరంలో మీడియా సమావేశం నిర్వహించారు.

చంద్రబాబు ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు...

• అకాల వర్షాల కారణం దాదాపు 70 నియోజకవర్గాల్లో పంటలకు నష్టం జరిగింది.
• రెండు రోజుల పాటు పలు నియోజకవర్గాల్లో పర్యటించాను. రైతులతో మాట్లాడాను...  వారి బాధలు చూశాను.
• నేను పర్యటన పెట్టుకున్న తరువాతే ప్రభుత్వం నుంచి స్పందన మొదలైంది. ప్రభుత్వ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి మేం ఆదుకుంటామని ప్రకటనలు మాత్రం ఇచ్చారు.
• నిర్దిష్టంగా ఏం చేస్తాం అనేది చెప్పకుండా... అధికారులు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారు.
• అన్నదాతలు కష్టాల్లో ఉంటే  సీఎం వచ్చి పరామర్శించాల్సిన బాధ్యత లేదా?
• ప్రభుత్వం రైతుల పంటలకు బీమా చేయించలేదు. ప్రీమియం చెల్లించలేదు
• రైతు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి ప్రీమియం చెల్లించి కల్పిస్తారు
• రబీకి ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలేదు. అంటే పరిహారం అంతా ఈ ప్రభుత్వమే  చెల్లించాలి

• రేపు కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల్లో పర్యటిస్తాను. జిల్లాలో రైతుల పరిస్థితి చూసి నా పర్యటన మరో రోజు పొడిగించుకున్నాను.
• ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు అని పెట్టి వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది
• రైతుల ధాన్యాన్ని ప్రభుత్వం తమకు కావాల్సిన మిల్లులకే పంపుతుంది. దగ్గరలో మిల్లులు ఉన్నా.... తమకు కావాల్సిన మిల్లులకే పంపి రైతుల్ని దోచుకుంటోంది
• నూక వస్తుందని మిల్లర్లు రైతుల నుంచి ముందే డబ్బులు వసూలు చేస్తున్నారు.
• రైతు భరోసా కేంద్రాల్లో తూకం వేసిన తరువాత మళ్లీ మిల్లు దగ్గర బస్తాకు 5 కేజీలు తరుగు తీస్తున్నారు.
• ఇలా రకరకాల విధానాల వల్ల బస్తాకు రైతు...రూ. 300 రూపాయాలు నష్టపోతున్నాడు.
• ప్రభుత్వం చెప్పినట్లు బస్తాకు రూ.1530 రావడం లేదు. ప్రభుత్వం సకాలంలో సేకరణ చేయలేకపోయింది.

• నేడు రాష్ట్రంలో 75 నుంచి 80 శాతం కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతుల్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాపులే. వీరంతా పేద వర్గాలు.
• పంట పొలంలో ఉంటేనే పరిహారం ఇస్తామంటున్నారు, ఏప్రిల్ 1న సేకరణ ప్రారంభించి ఉంటే ఇప్పుడు ఈ నష్టం ఉండేది కాదు. ధాన్యం అకాల వర్షాల బారిన పడేది కాదు.
• నేటి ఈ సమస్యకు పూర్తి కారణం సీఎం జగన్ రెడ్డి. రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు జగన్ వైఖరి ఉంది.
• కష్టాల్లో ఉన్న రైతుల్ని గాలికొదిలి, ఇంట్లో కూర్చుని వివేకా హత్య హంతకులను కాపాడే పనిలో జగన్ బిజీగా ఉన్నాడు.

• ప్రభుత్వం వెంటనే చేలో ఉండే పంటకు పరిహారం ఇవ్వాలి, ఎంత పరిహారం ఇస్తారో చెప్పాలి
• కోసిన పంట వర్షాలకు దెబ్బతింది. వాటిని పూర్తిగా సేకరిస్తారా లేదా చెప్పాలి ?
• ధాన్యం రవాణా ఉచితంగా చేయాలి... చేస్తారా చెయ్యరా
• మిల్లర్లు రైతు దగ్గర ధాన్యం విరిగిపోతుంది అని డబ్బులు వసూలు చేస్తున్నారు.
• ప్రభుత్వ వైఖరితో ఒక్కో బస్తాపై రైతు రూ. 300 నష్టపోతున్నాడు.

• రాష్ట్రంలో వరితో పాటు మొక్కజోన్న, వాణిజ్య పంటలకు నష్టం జరిగింది.
• వాణిజ్య పంటలకు సాగు పెట్టుబడి లక్ష రూపాయలు అవుతుంది... వారికి జరిగిన నష్టాన్ని ఇవ్వాలి.
• ప్రభుత్వం ఎప్పటిలోపు ఈ ధాన్యం కొంటారో స్పష్టమైన ప్రకటన చేయాలి. వర్షాలకు నష్టపోయిన రైతులకు ఏం సాయం చేస్తారో ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వాలి
• 72 గంటల్లో ప్రభుత్వం ధాన్యం అంతా కొనాలి, ఇదే ప్రభుత్వానికి డెడ్ లైన్. మళ్లీ తుఫాను వచ్చే అవకాశం ఉంది. అందుకే వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి

• జగన్ పాలనలో వరి వేసుకున్న రైతులు ఉరి వేసుకునే పరిస్థితి వచ్చింది,  మూడు రోజుల్లో ప్రభుత్వం ధాన్యం సేకరణ పూర్తి చెయ్యాలి.
• ధాన్యం కొనకపోతే 9వ తేదీ ఎమ్మార్వో ఆఫీసుల వద్ద మెమోరాండం ఇస్తాం.
• మా పంట మునిగింది... పరిహారం ఇవ్వండి అనే స్లోగన్ తో పోరాటం చేస్తాం.
• ప్రభుత్వం అప్పటికీ స్పందిచకపోతే... 13వ తేదీ నిరసన దీక్ష చేపడతాం... నేను కూడా నిరసనలో పాల్గొంటా.
• రైతులు కూడా కదలి రావాలి... చైతన్యంతో ముందుకు రావాలి. పోరాడాలి. లేకపోతే ఈ ప్రభుత్వం స్పందించదు.

• రైతులు తమ సమస్యలు... ధాన్యం అమ్మకంలో పడుతున్న ఇబ్బందులపై వీడియోలు, ఫోటోలు పెట్టండి. ప్రభుత్వం బాధ్యత గుర్తు చేద్దాం.
• మిల్లర్లు ఎలా డబ్బు అడుగుతున్నారు... ఎంత అడుగుతున్నారు అనే వీడియోలు పెట్టండి.

• హుద్ హుద్, తిత్లీ సమయంలో ప్రత్యేక జీవోలు ఇచ్చి మరీ పరిహారం అందజేశాం. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా నాడు పరిహారం పెంచి ఇచ్చాం. ఇలాంటి స్పష్టత ఈ ప్రభుత్వం దగ్గర ఉందా? ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది.
• మామిడి, పామాయిల్ వంటి పంటలకు కూడా నాడు సాయం చేశాం, నేడు వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల ఆక్వా కల్చర్ కూడా నాశనం అయ్యింది.
• రైతుకు కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటే రైతులు నిలబడతారు, ప్రభుత్వాలు చేయాల్సింది ఇదే.

More Telugu News