చేతిలో ఉన్న ఊతకర్ర విసిరేసి చలాకీగా నడిచిన పంత్... వీడియో వైరల్!

టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ గత డిసెంబరు చివరి వారంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురవడం తెలిసిందే. సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో పంత్ ప్రాణాలు నిలిచాయి. కాగా, పంత్ కాలికి, వీపుకు బలమైన గాయాలు కావడంతో, చాలాకాలం మంచానికే పరిమితం అయ్యాడు. కొంతకాలంగా పంత్ వాకింగ్ స్టిక్ సాయంతో నడుస్తున్నాడు. 

అయితే, తాజా వీడియో పంత్ అభిమానులను కచ్చితంగా సంతోషానికి గురిచేస్తుంది. చేతిలో ఉన్న ఊతకర్రను అక్కడే ఉన్న వ్యక్తిపైకి విసిరేసిన పంత్ కాస్త హుషారుగా నడవడం ఈ వీడియోలో చూడొచ్చు. 

దీనిపై నెటిజన్లు భారీ ఎత్తున స్పందిస్తున్నారు. పంత్ ను మళ్లీ ఇలా చూడడం ఎంతో ఆనందంగా ఉందని, టీమిండియాలోకి అతడి పునరాగమనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నామని కామెంట్లు చేస్తున్నారు.


More Telugu News