Chandrababu: సెంట్రల్ జైల్లో అప్పారావు, వాసును పరామర్శించిన చంద్రబాబు

Chandrababu meets Adireddy Apparao in Rajjahmundry central jail
  • చిట్ ఫండ్ కేసులో మే 12 వరకు అప్పారావు, వాసులకు రిమాండ్
  • రాజమండ్రి సెంట్రలో జైల్లో ఉన్న టీడీపీ నేతలు
  • ములాఖత్ ద్వారా కలిసిన చంద్రబాబు, అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ నేతలు అప్పారావు, వాసులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఉన్నారు. వీరిని ములాఖత్ లో కలవడానికి చంద్రబాబుకు అధికారులు అనుమతిని మంజూరు చేసిన సంగతి తెలిసిందే. జగజ్జనని చిట్ ఫండ్ కేసులో వీరిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని తూర్పుగోదావరి జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జి మే 12 వరకు రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో వీరిని సెంట్రల్ జైలుకు తరలించారు. ఆదిరెడ్డి అప్పారావు మాజీ ఎమ్మెల్సీ కాగా... ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త కావడం గమనార్హం.
Chandrababu
Telugudesam

More Telugu News