Shiva Karthikeyan: సాయిపల్లవి న్యూ మూవీ లాంచ్!

  • కమల్ సొంత బ్యానర్లో మరో సినిమా 
  • ఈ రోజునే చెన్నైలో మొదలైన సినిమా 
  • శివకార్తికేయన్ జోడీగా సాయిపల్లవి
  • దర్శకత్వం వహిస్తున్న రాజ్ కుమార్
Sai Pallavi in Shiva Karthikeyan Movie

తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా సాయిపల్లవికి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందనేది ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. తెలుగు ప్రేక్షకులు తమ మనసులో ఆమెకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు. సాయిపల్లవి ఒక సినిమాకి ఓకే చెప్పిందంటే, ఆ సినిమాలో కంటెంట్ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. ఇంతవరకూ ఆమె ఎంచుకుంటూ వచ్చిన కథలు .. పాత్రలే అందుకు నిదర్శనం. 

తెలుగులో ఈ మధ్య కాలంలో సాయిపల్లవి చేసిన 'లవ్ స్టోరీ'.. 'శ్యామ్ సింగ రాయ్' భారీ విజయాలను అందుకున్నాయి. 'విరాటపర్వం' సినిమా కూడా ఆమెకి ప్రశంసలను తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఆమె చేయనున్న తెలుగు సినిమా ఏమిటా అని అభిమానులు వెయిట్ చేస్తూ ఉండగా, ఆమె ఒక తమిళ సినిమాను అంగీకరించింది. 

శివకార్తికేయన్ జోడీగా ఆమె ఈ సినిమాలో కనిపించనుంది. కెరియర్ పరంగా శివ కార్తికేయన్ కి ఇది 21వ సినిమా. ఈ సినిమా కమల హాసన్ సొంత బ్యానర్ లో నిర్మితమవుతూ ఉండటం విశేషం. కమల్ క్లాప్ తో ఈ రోజునే చెన్నైలో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 

More Telugu News