Bollywood: బాలీవుడ్ లో నన్ను, కంగనాని టార్గెట్ చేశారు.. ప్రశ్నించేది మేమిద్దరమే కాబట్టి మమ్మల్ని దూరం పెడుతున్నారు: ‘కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్

  • బాలీవుడ్ సినిమాలు వాస్తవానికి దూరంగా ఉంటాయన్న వివేక్ అగ్నిహోత్రి
  • ప్రేక్షకులకు కనెక్ట్ కావడం లేదని, అందుకే ఎక్కువగా ఆడట్లేదని వ్యాఖ్య
  • తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు మాకు ఉందని వెల్లడి
vivek agnihotri says no one other than him and kangana ranaut questioning bollywood

‘కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి.. బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను బాలీవుడ్ లో పూర్తిగా దూరం పెట్టారని చెప్పారు. ఇంత పెద్ద పరిశ్రమలో జరిగే తప్పులను తాను, కంగనా రనౌత్ తప్ప మరెవరూ ప్రశ్నించడం లేదని, అందుకే కొందరు తమను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. 

తాజాగా వివేక్ అగ్నిహోత్రి ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘‘నన్ను బాలీవుడ్ లో పూర్తిగా దూరం పెట్టారు. కానీ నాకు మధ్యతరగతి ప్రజలు, ఆడియన్స్ నుంచి సపోర్ట్ ఉంటుంది. వాళ్లు నన్ను ఆదరిస్తున్నారు’’ అని చెప్పారు.

బాలీవుడ్ సినిమాలు వాస్తవానికి దూరంగా ఉంటాయని, కరణ్ జొహార్ సినిమాల్లో చూపించినట్టు బయట దేశంలోని యువత అలా ఉండదని చెప్పారు. ‘‘ఒకప్పుడు సినిమాలు చూస్తే ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేవారు. ఇప్పటి సినిమాలకి కనెక్ట్ కావట్లేదు. అందుకే ఎక్కువగా బాలీవుడ్ సినిమాలు ఆడట్లేదు. ఈ కారణంతోనే ప్రేక్షకులు బాలీవుడ్ ని విమర్శిస్తున్నారు. బాయ్ కాట్ చేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు.

‘‘ఇప్పుడు బాలీవుడ్ లో కొంతమంది నన్ను, కంగనాని టార్గెట్ చేశారు. ఇండస్ట్రీలో జరిగే తప్పులని మేమిద్దరమే ప్రశ్నిస్తాం కాబట్టి మమ్మల్ని దూరం పెడుతున్నారు. తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు మాకు ఉంది. అందుకే మా సినిమాలని, మమ్మల్ని టార్గెట్ చేసి, దూరం పెట్టి, వేరు చేయాలనుకుంటున్నారు’’ అని ఆరోపించారు.

More Telugu News