Telangana: దివ్యాంగ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Telangana government changes reservation rules for the disabled
  • శాశ్వత అంగవైకల్యం ఉంటేనే రిజర్వేషన్లు వర్తిస్తాయని స్పష్టీకరణ
  • తాత్కాలిక వైకల్యం ప్రయోజనలను నిలిపివేసిన ప్రభుత్వం
  • నియామకాలు, పదోన్నతుల్లో దివ్యాంగ రిజర్వేషన్ల నిబంధనలు మారుస్తూ  జీవో  విడుదల

దివ్యాంగ రిజర్వేషన్ల అమలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో ఇకపై శాశ్వత అంగవైకల్యం ఉన్న వారికి మాత్రమే దివ్యాంగ రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఇప్పటిదాకా అమలు చేస్తున్న తాత్కాలిక వైకల్య ధ్రువీకరణతో ఉద్యోగాలు, ప్రమోషన్లలో రిజర్వేషన్లను నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేసింది. తాత్కాలిక వైకల్య ధ్రువీకరణ పొందిన వ్యక్తుల్లో కొంతకాలం తర్వాత వైక్యల్య స్థితిలో మార్పులు వస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. 

కొందరికి వైకల్యం నయం అవుతుంటే.. ఇంకొందరికి శాశ్వత అంగవైకల్యం కలిగిన సంఘటనలను గుర్తించింది. ఈ నేపథ్యంలో నియామకాలు, ప్రమోషన్లలో కేవలం శాశ్వత వికలత్వ నిర్ధారణ ధ్రువీకరణ పత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో 41 జారీ చేసింది. దీని ప్రకారం కనీసం 40 శాతం వైకల్యం ఉన్నట్లు ఇచ్చే సరిఫికెట్లనే రిజర్వేషన్లకు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది.

  • Loading...

More Telugu News