టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో సిట్ అధికారులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. వికారాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న భగవంత్, అతడి తమ్ముడు రవికుమార్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

ఈ కేసులో నిందితుడైన డాక్యా నాయక్‌ నుంచి ఏఈ పేపర్‌ను భగవంత్ తన తమ్ముడి కోసం కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వారిని అరెస్టు చేశారు. డాక్యా నాయక్ బ్యాంకు ఖాతాలను పరిశీలించగా భగవంత్ రూ. 2 లక్షలు పెట్టి పేపర్ కొనుగోలు చేసినట్టు బయటపడింది. కాగా, పేపర్ లీక్ నిందితులకు రూ.33.4 లక్షల మేర అందినట్టు ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తులో తేలింది.


More Telugu News