Anand Mahindra: ఇది రైలు బండా లేక స్వర్గమా..?.. ఆనంద్ మహీంద్రా వీడియో

Anand Mahindra take on the illusion of comfort with a video of a train journey vedio
  • ఆధునిక జీవితంలో అతి అంటే ఇదే అంటూ ట్వీట్
  • అనవసర ఉత్పత్తుల వినియోగంతో భారీగా వ్యర్థాల విడుదల
  • వ్యక్తిగతంగా తనను ఎంతో నిరుత్సాహానికి గురి చేసినట్టు వెల్లడి
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరో సరికొత్త వీడియోతో ట్విట్టర్ లో తన ఫాలోవర్ల ముందుకు వచ్చారు. ఆధునిక రైలు బండి, అందులోని అత్యాధునిక సౌకర్యాలను చూస్తే విమానాల్లో ప్రయాణించే వారు కూడా రైల్లోనే వెళతామని మొండికేస్తారు. 

ప్రయాణికుల క్యాబిన్ వద్ద బోలెడు సౌకర్యాలు పలకరిస్తాయి. అసలు ఏ సౌకర్యం లేదు? అని అనుకోవాల్సిందే. నేటి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. టికెట్ ఖరీదైనా సరే, సౌకర్యంలో రాజీ పడేది లేదంటున్నారు. నిజానికి ఈ వీడియోలో ఉన్న రైలు సౌకర్యాలు ఆనంద్ మహీంద్రాకు నచ్చలేదు. ఎందుకంటే, ఈ అనవసర ఉత్పత్తులను లగ్జరీ పేరుతో వాడేయడం వల్ల భూమిపై చెత్త పేరుకుపోవడం మినహా వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదన్నది ఆయన అభిప్రాయం. ఆధునిక జీవితంలో అతి అని దీన్ని తేల్చేశారు. దీనిపై తన ఫాలోవర్ల కళ్లు తెరిపించే ప్రయత్నం చేశారు.

‘‘అనేక ఉత్పత్తులు ట్రిప్ ను ఏ విధంగా ఖరీదుగా మార్చేస్తాయనడానికి నిదర్శనం. వ్యక్తిగతంగా నేను ఇంతకంటే నిరుత్సాహపరిచేదాన్ని చూడలేదు. ఆధునిక జీవితంలో అతికి, అనవసర ఉత్పత్తుల వినియోగానికి ఇది నిదర్శనం. ఇవన్నీ భూమిపై చెత్త గుట్టలు పేరుకుపోవడానికే’’ అంటూ ఆనంద్ మహీంద్రా తన ఆవేదనను పంచుకున్నారు.
Anand Mahindra
train journey
luxarious
video
twitter
waste

More Telugu News