rice: రైస్ తో పాటు ఈ పదార్థాలను తీసుకుంటే నష్టమే ఎక్కువ!

  • అన్నంతో చపాతీ తీసుకోవడం సరికాదు
  • రెండింటిలోనూ గ్లైసిక్ మిక్ ఇండెక్స్ ఎక్కువ
  • బంగాళాదుంపల్లోనూ కేలరీలు ఎక్కువే
  • అన్నంతో పండ్లు కూడా కలిపి తీసుకోవద్దు
you should never eat with rice

అన్నంతో పాటు పలు ఇతర పదార్థాలు కలిపి తినే అలవాటు కొందరిలో ఉంది. కాకపోతే రైస్ తో అన్ని రకాల పదార్థాలు కలిపి తీసుకోకూడదు. దానివల్ల పలు అరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు.

చపాతి
చాలా మంది ఒకటి రెండు చపాతీలు తిని, చివర్లో పెరుగన్నంతో ముగిస్తుంటారు. కానీ రైస్, చపాతీ కలపొద్దన్నది సలహా. ఈ రెండింటిలో అధిక గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. దాంతో తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉంటుంది. కొందరిలో గ్యాస్ కూడా ఫామ్ అవుతుంది.
 
బంగాళాదుంప
రైస్ లో కేలరీలు ఎక్కువ. బంగాళాదుంపల్లో కేలరీలు ఎక్కువ. మరి ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం సరికాదు. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల అధిక కేలరీలు వచ్చి చేరతాయి. రెండూ కలిపి తీనేట్టు అయితే తక్కువ మోతాదులో తీసుకోవాలి.

పండ్లు
అన్నం అనేది వండించిన పదార్థం. కానీ పండ్లు అన్నవి ప్రాసెస్ చేయని ముడి పదార్థంతో సమానం. కనుక ఈ రెండూ కలిపి తింటే జీర్ణ సమస్యలు ఎదురవుతాయి.

టీ/కాఫీ
అన్నం తిన్న వెంటనే టీ లేదా కాఫీ తీసుకోవద్దు. అది కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది.

సలాడ్
స్నానానికి ముందు సలాడ్ తీసుకునే అలవాటు కొందరిలో ఉంటుంది. బలహీన జీర్ణవ్యవస్థ ఉన్నవారిలో దీనివల్ల సమస్యలు కనిపిస్తాయి. 

స్వీట్ కార్న్
స్వీట్ కార్న్ లో  గంజి పదార్థం ఎక్కువ. కనుక దీని పరిమాణాన్ని తగ్గించుకోవాలి. ఫెర్మెంట్ చేసిన యుగర్ట్ తదితర పదార్థాలు తీసుకోవచ్చు.

ప్రాసెస్డ్ రైస్
నేడు మార్కెట్లో మనం కొంటున్న బియ్యం అన్నీ దాదాపుగా రిఫైన్డ్ ప్రాసెస్డ్ తో ఉంటున్నాయి. డైట్ లో బ్రౌన్ రైస్ కలుపుకోవడం మంచి ఐడియా. రైస్ తోపాటు వేరేవి కలిపి తీసుకున్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉంటే అవి సరిపడలేదని అర్థం.

More Telugu News