Tollywood: తమిళ హాస్య నటుడు, దర్శకుడు మనోబాల కన్నుమూత

Acto director Manobala passes away at 69 in Chennai
  • దక్షిణాదిలో వందకుపైగా చిత్రాల్లో నటించిన మనోబాల
  • తమిళ, కన్నడ, హిందీలో 20కిపైగా చిత్రాలకు దర్శకత్వం
  • హాస్య నటుడిగా నవ్వించిన మనోబాల
దక్షిణాది ప్రముఖ నటుడు, దర్శకుడు మనోబాల ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 69 సంవత్సరాల మనోబాల గత రెండు వారాలుగా కాలేయ సంబంధిత సమస్యల కారణంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఈ వార్త తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో అందరినీ షాక్‌కు గురి చేసింది. ఆయన అంత్యక్రియలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన మనోబాల పలు డబ్బింగ్, కొన్ని స్ట్రెయిట్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఆయన తెలుగులో చివరగా మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో జడ్జి పాత్రలో కనిపించారు. శివకార్తికేయన్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన డాన్ చిత్రంలో స్కూల్ టీచర్ గా అందరినీ నవ్వించారు. మనోబాలకు భార్య ఉష మహదేవన్, కుమారుడు హరీశ్ ఉన్నారు.
Tollywood
Kollywood
actor
director
manobala
dies

More Telugu News