Narendra Modi: బురదలో కూరుకుపోయిన ప్రధాని మోదీ ఎస్కార్ట్ హెలికాప్టర్... జేసీబీతో బయటకు లాగిన వైనం!

  • కర్ణాటకలో ఎన్నిల ప్రచార హోరు
  • సుడిగాలి పర్యటనలు చేస్తున్న ప్రధాని మోదీ
  • ఇవాళ రాయచూరు జిల్లా సింధనూరు రాక
  • ఓ వరిపొలంలో హెలిప్యాడ్ ఏర్పాటు
  • పొలం చిత్తడిగా ఉండడంతో ఇరుక్కుపోయిన హెలికాప్టర్
Modi escort helicopter stuck in mud at Sindhanur

కర్ణాటక ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రచార కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. బీజేపీని మళ్లీ గద్దెనెక్కించేందుకు తన ఛరిష్మాను ఉపయోగిస్తున్నారు. అయితే, ఇవాళ ఆయన పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. మోదీ ఎస్కార్ట్ హెలికాప్టర్ బురదలో కూరుకుపోయింది. ఆ హెలికాప్టర్ ల్యాండైన ప్రదేశం చిత్తడిగా ఉండడంతో ఈ పరిస్థితి ఎదురైంది. 

రాయచూర్ జిల్లా సింధనూరు వద్ద ఓ సభలో పాల్గొనేందుకు మోదీ వచ్చారు. హోసళ్లి క్యాంపు సమీపంలోని ఓ వరిపొలంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. కానీ ఆ పొలం ఇంకా చిత్తడిగానే ఉండడంతో, ల్యాండైన హెలికాప్టర్ మళ్లీ గాల్లోకి లేవలేకపోయింది. 

దాంతో, ఓ జేసీబీ, 100 మంది మనుషుల సాయంతో హెలికాప్టర్ ను బురద నుంచి బయటికి తీసుకువచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది తప్పిదం వల్లే ప్రధాని మోదీ ఎస్కార్ట్ హెలికాప్టర్ కు ప్రమాదం ఎదురైందని భావిస్తున్నారు.

More Telugu News