DK Shivakumar: హెలికాప్టర్ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డ డీకే శివకుమార్

DK Shivakumar helicopter hit by bird
  • డీకే ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను ఢీకొన్న గద్ద
  • పగిలిపోయిన హెలికాప్టర్ అద్దాలు
  • హెలికాప్టర్ ను అత్యవసరంగా ల్యాండ్ చేసిన వైనం
కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను ఒక గద్ద ఢీకొంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ములబాగిలు వెళ్తుండగా హొసకొటే వద్ద ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను గద్ద ఢీకొంది. 

ఈ ప్రమాదంలో హెలికాప్టర్ అద్దం పగిలిపోయింది. డీకే శివకుమార్ సురక్షితంగా బయటపడ్డారు. ఆయన కెమెరామెన్ స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే హెలికాప్టర్ ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. 

DK Shivakumar
Congress
Helicopter

More Telugu News