Akhil: సాక్షి వైద్య ఆశలు ఇక ఆ సినిమాపైనే!

  • 'ఏజెంట్'తో పరిచయమైన సాక్షి వైద్య 
  • నిరాశపరిచిన సినిమా ఫలితం 
  • తరువాత సినిమాగా 'గాండీవధారి అర్జున'
  • వరుణ్ తేజ్ జోడీగా అలరించనున్న బ్యూటీ
Sakshi Vaidya Special

టాలీవుడ్ కి ఈ మధ్య కాలంలో కొంతమంది హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చారు. అయితే వీరిలో ఎవరూ కూడా హిట్ కొట్టలేకపోవడం ఆశ్చర్యం. అనిక సురేంద్రన్ .. గౌరీ కిషన్ .. ఆషిక రంగనాథ్ వంటి హీరోయిన్స్ పరిచయమైనా, వారిని పరాజయాలే పలకరించాయి. ఈ నేపథ్యంలోనే 'ఏజెంట్' సినిమాతో సాక్షి వైద్య పరిచయమైంది. 

సాక్షి వైద్య ఇంతకుముందు ఏ భాషలోను సినిమా చేయలేదు. మోడలింగ్ చేస్తూ వెళుతున్న ఆమె, ఫస్టు టైమ్ చేసిన సినిమా ఇది. పెద్ద బ్యానర్ .. అఖిల్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్ అనగానే ఆమె ఆలోచన చేయలేదు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ కావడం తప్పకుండా ఆమెకి నిరాశను కలిగించే విషయమే అవుతుంది. 

ఇక ఇప్పుడు ఆమె ఆశలన్నీ తరువాత సినిమా అయిన 'గాండీవధారి అర్జున' పైనే ఉన్నాయి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ జోడీగా ఆమె అలరించనుంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గానే ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతోనైనా సాక్షి ఆశ నెరవేరుతుందేమో చూడాలి. 

More Telugu News