పెళ్లయిన వెంటనే శివాలయంలో ఫాతిమా భుట్టో పూజలు.. శివలింగానికి క్షీరాభిషేకం!
- అమెరికాకు చెందిన గ్రాహం బైరానును వివాహం చేసుకున్న ఫాతిమా భుట్టో
- కరాచీలోని అతికొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో వివాహం
- శివాలయంలో పూజలపై రెండుగా విడిపోయిన సోషల్ మీడియా
వివాహానంతరం కరాచీలోని పురాతన మహాదేవ ఆలయానికి వెళ్లిన దంపతులు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివలింగానికి పాలాభిషేకం నిర్వహించారు. ఆమె వెంట సోదరుడు జుల్ఫికర్ అలీ భుట్టో జూనియర్ కూడా ఉన్నారు. పాకిస్థాన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో వివాహాన్ని నిరాడంబరంగా జరిపించినట్టు జుల్ఫికర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాగా, ఫాతిమా భుట్టో శివాలయంలో పూజలపై పాక్ సోషల్ మీడియా రెండుగా విడిపోయింది. శివాలయంలో పూజలను కొందరు సమర్థిస్తుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు.