Akhil: 'ఏజెంట్' మూడు రోజుల వసూళ్లు ఇవేనంటూ టాక్!

  • భారీ అంచనాల మధ్య విడుదలైన 'ఏజెంట్'
  • తొలిరోజునే వచ్చిన నెగెటివ్ టాక్ 
  • అభిమానుల్లో సైతం అసంతృప్తి 
  • బిజినెస్ కి .. వసూళ్లకు పొంతనలేని తీరు
Agent movie update

అఖిల్ హీరోగా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా 'ఏజెంట్' సినిమా రూపొందింది. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాకి, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమా విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా, తొలి రోజునే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. అక్కినేని అభిమానులు కూడా అసంతృప్తితో పెదవి విరిచారు.

మూడు రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్ల గ్రాస్ ను .. 5.10 కోట్ల షేర్ ను వసూలు చేసిందని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 11.50 కోట్ల గ్రాస్ .. 6.24 కోట్ల షేర్ ను రాబట్టిందని అంటున్నారు. ఈ మూడు రోజులు కూడా ఏ రోజుకు ఆ రోజు వసూళ్లు తగ్గుతూ రావడం ఆశ్చర్యం. 

నిర్మాణ పరమైన విలువల విషయంలో వంక బెట్టడానికి లేదు. అలాగే సిక్స్ ప్యాక్ కోసం అఖిల్ చేసిన కసరత్తు .. చూపించిన ఎనర్జీకి కూడా మంచి మార్కులే ఇవ్వొచ్చు. కథాకథనాలు .. పాత్రల చిత్రీకరణ విషయంలోనే ప్రేక్షకులను ఈ సినిమా నిరాశపరిచిందని అంటున్నారు. ఈ సినిమా బిజినెస్ జరుపుకున్న తీరుకు .. వసూళ్లకు ఎంతమాత్రం పొంతన లేకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

More Telugu News