G. Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్వల్ప అస్వస్థత.. ఎయిమ్స్‌లో చికిత్స

Central Minister admitted to AIIMs following gastric problems
  • ఛాతిలో స్వల్పంగా నొప్పి అనిపించడంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన మంత్రి
  • గ్యాస్ట్రిక్  సమస్య ఉన్నట్టు పరీక్షల్లో నిర్ధారణ
  • సోమవారం డిశ్చార్జ్ చేసే అవకాశం
స్వల్ప అస్వస్థతకు లోనైన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి (58) ఆదివారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నట్టు పరీక్షల్లో తేలింది. 

ఛాతీ ప్రాంతంలో స్వల్పంగా నొప్పి అనిపించడంతో కిషన్ రెడ్డి రాత్రి 11.00 గంటల సమయంలో ఎయిమ్స్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఆయనకు కార్డియోన్యూరో సెంటర్‌లో పలు పరీక్షలు నిర్వహించారు. అనంతరం, మంత్రికి గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నట్టు గుర్తించిన వైద్యులు చికిత్స చేశారు. ఈ రోజు ఆయనను డిశ్చార్జ్ చేయొచ్చని సమాచారం.
G. Kishan Reddy
New Delhi

More Telugu News