mumbai: ముంబైలో పక్కింటి వారితో గొడవ... మహిళ కాల్చివేత

Woman shot dead during quarrel with neighbour in Mankhurd
  • ముంబయిలోని మన్ ఖుర్ద్ ప్రాంతంలో ఘటన
  • ఓ విషయంలో పక్కింటి వారితో గొడవ
  • కేసు నమోదు చేసుకొని, దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు
మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని మన్ ఖుర్ద్ లో శనివారం సాయంత్రం ఓ మహిళను ఆమె పొరుగువారే కాల్చి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందిరా నగర్ ప్రాంతంలో మహిళకు, ఆమె పొరుగింటి వారికి ఏదో అంశంపై గొడవ జరిగినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో సదరు మహిళను కాల్చి చంపారు.

గొడవకు దిగిన పక్కింటి మహిళ భర్త, ఆమె కొడుకు సంఘటన స్థలానికి చేరుకొని ఒక రౌండ్ కాల్పులు జరిపారని, బాధితురాలి ఛాతీకి గాయమైందని తెలిపారు. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లగా, మార్గమధ్యంలోనే మరణించినట్లు తెలిపారు. ఆసుపత్రికి వచ్చే లోపు ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఆమెను కాల్చిన తర్వాత నిందితుడు, అతని కుమారుడు అక్కడి నుండి పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. కాగా, తన కూతురుపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ మృతురాలు ఇటీవల నిందితుడి సోదరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
mumbai
murder

More Telugu News