Chandrababu: చంద్రబాబును నమ్మి పవన్ కల్యాణ్ పతనమవుతున్నారు: ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ

AP minister warns Pawan Kalyan for alliance with TDP
  • టీడీపీతో కలిస్తే జనసేన కూడా పతనమవడం ఖాయమని వ్యాఖ్య
  • రెండు పార్టీలలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తేల్చుకోవాలని సూచన
  • ఎన్టీఆర్ అభిమానులు అంతా వైసీపీ వెంటే ఉన్నారన్న మంత్రి
తెలుగుదేశం, జనసేన పార్టీలపై మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతరించి పోతున్న తెలుగు దేశం పార్టీతో కలిస్తే జనసేన కూడా పతనమవడం ఖాయమని వ్యాఖ్యానించారు. చంద్రబాబును నమ్మి పవన్ కల్యాణ్ రాజకీయంగా దిగజారిపోతున్నాడని విమర్శించారు. 

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తారనే ప్రచారంపై కూడా ఆయన స్పందించారు. అసలు, ముందు రెండు పార్టీలలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తేల్చుకోవాలన్నారు. ముందు మీ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పండి అని నిలదీశారు.

స్వర్గీయ నందమూరి తారక రామారావు అభిమానులు అందరు కూడా వైసీపీలోనే ఉన్నారని చెప్పారు. ప్రజలను అశాంతికి గురి చేసేలా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని భగ్గుమన్నారు.
Chandrababu
Pawan Kalyan

More Telugu News