indigo: విజయవాడ-హైదరాబాద్ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం

Hyderabad gannavaram indigo in Vijayawada
  • విజయవాడలో రన్ వే పైన నిలిచిపోయిన విమానం
  • విమానాన్ని పార్కింగ్ ప్రదేశానికి తరలించిన అధికారులు
  • ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణికుల తరలింపు
శనివారం రాత్రి విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో ప్రయాణీకులు ఇబ్బందులకు గురయ్యారు. నిన్న రాత్రి 7.45 గంటలకు ఇండిగో విమానం హైదరాబాద్ నుండి విజయవాడ చేరుకుంది. తిరుగు ప్రయాణంలో అందులో 72 మంది ప్రయాణీకులు ఉన్నారు. అయితే సాంకేతిక కారణాలతో ఆ విమానం రన్ వే పై నిలిచింది. 

విమానాశ్రయ అధికారులు అక్కడకు చేరుకొని, ఆ విమానాన్ని పార్కింగ్ ప్రదేశానికి తరలించారు. ఆ తర్వాత ప్రయాణికులను ప్రత్యామ్నాయ సర్వీసు ద్వారా హైదరాబాద్ తరలించేందుకు చర్యలు తీసుకున్నారు.
indigo

More Telugu News