Telangana Secretariat: కొత్త సెక్రటేరియెట్ లో ఏయే ఫ్లోర్లలో ఏయే శాఖలు ఉంటాయంటే..!

  • మొత్తం ఆరు అంతస్తులుగా నిర్మాణం.. ఆరో అంతస్తులో సీఎం ఆఫీసు
  • ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆఫీసు మొదటి అంతస్తులో..
  • మూడో అంతస్తులో మంత్రి కేటీఆర్ కార్యాలయం
Telangana Secretariat Which Departments are on which floor Details

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కొత్త సెక్రటేరియెట్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్న కొత్త సచివాలయంలో సీఎం, ఇతర మంత్రుల కార్యాలయాలు, వివిధ ప్రభుత్వ శాఖల ఆఫీసులు ఏ ఫ్లోర్ లో ఉంటాయంటే..

గ్రౌండ్‌ ఫ్లోర్‌:
ఎస్సీ సంక్షేమ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమం, రెవెన్యూ, కార్మిక, ఉపాధి కల్పన శాఖలు. ఇందులో ‘ఏ’ వింగ్ లో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ’బి‘ వింగ్ లో మంత్రి మల్లారెడ్డి ఉంటారు

ఫస్ట్ ఫ్లోర్‌:
హోం, గ్రామీణాభివృద్ది, విద్యా, పంచాయతీరాజ్‌ శాఖలు.. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ ‘ఏ’ వింగ్ లో, ’బి‘ వింగ్ లో సబితా ఇంద్రారెడ్డి, ’డి‘ వింగ్ లో ఎర్రబెల్లి దయాకర్ రావు

సెకండ్ ఫ్లోర్‌:
వైద్యారోగ్యం, విద్యుత్‌, పశు సంవర్థక, ఆర్థిక శాఖలు.. హరీశ్ రావు ’ఏ‘ వింగ్ లో, ’బి‘ వింగ్ లో జగదీశ్ రెడ్డి, ’డి‘ వింగ్ లో తలసాని శ్రీనివాస్‌ యాదవ్

థర్డ్ ఫ్లోర్‌:
మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం, పురపాలక, పట్టణాభివృద్ది, ప్లానింగ్‌, ఐటీ, వ్యవసాయ, సహకార, పరిశ్రమలు, వాణిజ్య శాఖలు.. ’ఏ‘ వింగ్ లో కేటీఆర్‌, సత్యవతి రాథోడ్‌ ’బి‘ వింగ్ లో, ’డి‘ వింగ్ లో నిరంజన్ రెడ్డి

ఫోర్త్ ఫ్లోర్‌:
పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, యువజన, పర్యాటక, బీసీ సంక్షేమ, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక, నీటి పారుదల, న్యాయశాఖలు.. ఇంద్రకరణ్ రెడ్డి ’ఏ‘ వింగ్ లో, ’బి‘ వింగ్ శ్రీనివాస్‌ గౌడ్‌, ’డి‘ వింగ్ లో గంగుల కమలాకర్

ఫిఫ్త్ ఫ్లోర్:
రవాణా, రహదారులు, సాధారణ పరిపాలన, భవనాల శాఖలు.. ప్రశాంత్ రెడ్డి ’ఏ‘ వింగ్ లో, ’డి‘ వింగ్ లో పువ్వాడ అజయ్‌

సిక్స్త్ ఫ్లోర్‌:
సీఎం కేసీఆర్‌ ఆఫీసు, సీఎంవో, సీఎం కార్యదర్శులు.

More Telugu News