Yadadri Temple: యాదాద్రిలో ఎల్లుండి నుంచి శ్రీ నరసింహస్వామి జయంత్యుత్సవాలు.. నిత్యకల్యాణం నిలిపివేత

Nitya Kalyanam will be stopped in Yadadri from may 2 to 4th
  • మే 2 నుంచి 4 వరకు నిత్య కల్యాణం, శ్రీ సుదర్శన హోమం నిలిపివేత
  • పాతగుట్ట ఆలయంలోనూ నిలిచిపోనున్న నిత్య కల్యాణం
  • ఐదో తేదీ నుంచి యథావిధిగా నిత్య కల్యాణం
  • భక్తులు సహకరించాలన్న ఆలయ అధికారులు
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో ఎల్లుండి (మంగళవారం) నుంచి శ్రీ నరసింహస్వామి జయంత్యుత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మే నాలుగో తేదీ వరకు రోజు వారీ జరిగే నిత్య కల్యాణం, శ్రీ సుదర్శన హోమం, బ్రహ్మోత్సవాలను నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. 

మే 5వ తేదీ నుంచి తిరిగి ఇవన్నీ ప్రారంభమవుతాయని, భక్తులు గమనించి సహకరించాలని ఆలయ అధికారులు కోరారు. ఆలయానికి అనుబంధంగా ఉన్న పాతగుట్ట ఆలయంలోనూ రెండో తేదీ నుంచి 4 వరకు నిత్యకల్యాణం నిలిపివేస్తున్నట్టు తెలిపారు.
Yadadri Temple
Telangana
Lord Sri Laxminarasimha Swamy

More Telugu News