Jagan: మే 3న భోగాపురం విమానాశ్రయానికి సీఎం జగన్ శంకుస్థాపన

CM Jagan will lay foundation stone for airport in Bhogapuram
  • విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు
  • నిర్మించనున్న జీఎంఆర్ గ్రూపు
  • తొలి దశలో రూ.5 వేల కోట్ల పెట్టుబడి
  • సీఎం రాక నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
ఏపీ ప్రభుత్వం విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టును అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి దశలో జీఎంఆర్ గ్రూపు భోగాపురం విమానాశ్రయ నిర్మాణం కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేయనుంది. తొలి దశలో 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా భోగాపురం ఎయిర్ పోర్టును రూపుదిద్దనున్నారు. 

కాగా, సీఎం జగన్ మే 3వ తేదీన విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న సభాస్థలిని ఆమె జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి పరిశీలించారు.
Jagan
Airport
Bhogapuram
Vijayanagaram District
YSRCP
Andhra Pradesh

More Telugu News