Dhoni sir: నా పేరు పక్కనే ధోనీ సర్ పేరు.. అది చాలు: ధృవ్ జురేల్

Dhoni sir ran me out Will feel very proud Jurels astonishing reaction to being dismissed by MSD direct hit
  • రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ ఊహించని స్పందన
  • ధోనీ అవుట్ చేయడాన్ని గర్వంగా భావిస్తానన్న క్రికెటర్
  • రికార్డుల్లో ఎప్పటికీ నిలిచిపోతుందన్న సంతోషం
రాజస్థాన్ రాయల్స్ యువ క్రికెటర్ ధృవ్ జురేల్ తనను దిగ్గజ క్రికెటర్, సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అవుట్ చేయడాన్ని ఎంతో ప్రత్యేకమైన విషయంగా తీసుకున్నాడు. గురువారం (ఈ నెల 27న) జైపూర్ లోని సవాయి మాన్ సింగ్ స్టేడియంలో సీఎస్కే, రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ధృవ్ జురేల్ 15 బంతుల్లో 34 పరుగులు చేసి మెరిశాడు. ఆఖరి ఓవర్లో ఓ పరుగు కోసం ప్రయత్నించగా.. జురేల్ ను వికెట్ కీపర్ ధోనీ రనవుట్ చేశాడు. దూరం నుంచి బంతిని విసరడంతో అది నేరుగా వచ్చి వికెట్లను తాకింది. 

ధోనీ విసిరిన బంతి గురి తప్పకపోవడంపై సోషల్ మీడియాలో అభిమానుల మధ్య చర్చకు దారితీసింది. తనను లెజెండరీ వికెట్ కీపర్ ధోనీ అవుట్ చేయడం పట్ల జురేల్ స్పందించిన తీరు అభిమానులను ఇంకెంతో ఆకట్టుకుంది. దీనిపై జురేల్ మాట్లాడిన వీడియోని రాజస్థాన్ రాయల్స్ తన యూట్యూబ్ ఛానల్ లో ఉంచింది. తనను ధోనీ అవుట్ చేయడం తనకు ఎప్పుడూ చిరస్మరణీయంగా ఉండిపోతుందని జురేల్ వ్యాఖ్యానించాడు.

‘‘20 ఏళ్ల తర్వాత నేను స్కోరు కార్డును చూసినప్పుడు.. ధోనీ సర్ నన్ను రనవుట్ చేసినట్టు కనిపిస్తుంది. నేను దాన్ని చూసి ఎంతో గర్విస్తాను. అక్కడ నా పేరు ఉంటుంది. దాని పక్కనే ధోనీ సర్ పేరు కూడా ఉంటుంది. నాకు అది చాలు’’ అంటూ ధోనీ పట్ల తన అభిమానాన్ని జురేల్ చాటుకున్నాడు.
Dhoni sir
ran me out
feel very proud
direct hit
dhruv jurel
rajasthan royals

More Telugu News