USA: గ్రీన్‌ కార్డులపై దేశాలవారీగా ఉన్న పరిమితిని ఎత్తేయాలి..ప్రముఖ ఎన్నారై డిమాండ్

  • అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు రో ఖన్నా ఆధ్వర్యంలో బుధవారం యూస్-ఇండియా సమ్మిట్
  • కార్యక్రమంలో ప్రసంగించిన ప్రముఖ భారత సంతతి వ్యాపార వేత్త అజయ్ జైన్ భుటోరియా
  • గ్రీన్ కార్డులపై కంట్రీ లిమిట్ కారణంగా బ్యాక్ లాగ్ పెరుగుతోందని ఆవేదన
  • ఈ పరిమితిని ఎత్తివేయాలని డిమాండ్
  • హెచ్-1బీ వీసాలపై లేని పరిమితి గ్రీన్ కార్డులపై ఎందుకని ప్రశ్న
Lift 7 percent cap on green cards urges indian community leader

గ్రీన్ కార్డుల జారీపై దేశాలవారీగా ఉన్న ఏడు శాతం గరిష్ఠ పరిమితిని ఎత్తివేయాలని అమెరికాలోని ప్రముఖ భారత సంతతి వ్యాపార వేత్త అజయ్ జైన్ భూటోరియా అక్కడి చట్టసభల సభ్యులను డిమాండ్ చేశారు. డిమాండ్ అధికంగా ఉండే గ్రీన్‌కార్డులపై పరిమితి కారణంగా వీటి కోసం వేచి చూసేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతోందని తెలిపారు. బుధవారం యూస్ క్యాపిటల్‌లో జరిగిన యూస్-ఇండియా సమ్మిట్‌లో అజయ్ జైన్ ప్రసంగించారు. అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు రో ఖన్నా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 

హెచ్-1బీ వీసాపై లేని పరిమితి గ్రీన్ కార్డుపై ఎందుకని అజయ్ జైన్ ప్రశ్నించారు. అమెరికాలో ప్రస్తుతం 8.8 లక్షల మంది గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. వీరిలో అత్యధికులు భారత్, చైనా వారేనని వెల్లడించారు. కొందరు పదేళ్లుగా గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారని, చట్టంలో మార్పులు చేయకపోతే మరో 50 ఏళ్ల పాటు వేచి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.

More Telugu News