Chandrababu: జే బ్రాండ్ తో పేదలను దోచుకుంటున్నారు: చంద్రబాబు

Chandrababu lashes out at YS Jagan
  • కృష్ణా నది పక్కనే ఉన్నా ఇసుక దొరకడం లేదన్న చంద్రబాబు
  • దేవుడిచ్చిన ఇసుకను జగన్ అండ్ కో దోచేస్తున్నారని వ్యాఖ్య
  • నవరత్నాలు కాదు... రాలిపోయిన రత్నాలని విమర్శ
రాష్ట్రంలో జే బ్రాండ్ తో పేదలను దోచుకుంటున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. కృష్ణా నది పక్కనే ఉన్నా ఆయా ప్రాంతాల్లో ఇసుక దొరకడం లేదన్నారు. దేవుడు ఇచ్చిన ఇసుకను జగన్ అండ్ కో దోచేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎంపీ, వైసీపీ నేతలు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని విమర్శించారు. ఇసుక దోపిడీ సొమ్ము తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్తుందని ఆరోపించారు. వైసీపీ అమలు చేస్తోంది నవరత్నాలు కాదని, రాలిపోయిన రత్నాలు అన్నారు.
Chandrababu

More Telugu News