Street Food Vendor: ఈ చెఫ్ టాలెంట్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

Flying Pizza Dough Viral Video Showcasing Street Food Vendors Skill Is Unbelievable
  • గాల్లోనే పిజ్జా పిండి తయారీ
  • చేతులతో గుండ్రంగా తిప్పుతూ నైపుణ్య ప్రదర్శన
  • ఎంతగానో మెచ్చుకుంటున్న నెటిజన్లు
  • ఒక్క రోజులోనే 55 లక్షల వ్యూస్
కొందరిలో అపురూపమైన, ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. చూసి కాపీ కొడితే మరొకరికి వచ్చేది కాదు. అంతటి నైపుణ్యాలు ఎలా వచ్చాయా? అని నోరెళ్లబెట్టాల్సిందే. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా అలాంటి ఘటన గురించే. రెస్టారెంట్లు ఎన్ని ఉన్నా వీధుల్లో తినుబండారాలను విక్రయించే కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలోనే ప్రజలు కనిపిస్తుంటారు. రుచికరమైన ఆహార పదార్థాల కోసం ఎక్కువ మంది వీధుల్లోని బండ్ల వద్ద తింటుంటారు. పైగా తక్కువ ధరలకు వస్తాయి.

కానీ, ఈ చెఫ్ దగ్గరకు కేవలం ఆహారంపై ప్రేమతోనే వస్తారని అనుకుంటే పొరపాటు. ఈ చెఫ్ తయారీ నైపుణ్యాలను కళ్లారా, ప్రత్యక్షంగా చూసేందుకు ఎక్కువ సంఖ్యలో విచ్చేస్తుంటారు. అతడొక స్ట్రీట్ వెండర్. ప్రదేశం ఎక్కడన్నది తెలియదు కానీ, బహుశా చైనా అయి ఉంటుంది. అందులో ఓ కుర్రాడు పిజ్జా పిండిని కలుపుతాడు. పిజ్జా అంటే గుండ్రంగా ఉంటుంది కదా. పిండిని కలిపి దాన్ని గుండ్రంగా చేసి బలంగా గాల్లోకి విసురుతాడు. అది చుట్టూ, తిరిగి తిరిగి వచ్చి అతడి చేతుల్లోనే పడిపోతుంది. దాన్ని అలా గుండ్రంగా తిప్పేస్తూ పిజ్జా మాదిరి పెద్ద ఆకారంగా పిండి ముద్దను మార్చడాన్ని చూడొచ్చు.

సీసీటీవీ ఇడియట్స్ అనే యూజర్ ట్విట్టర్ లో దీన్ని ఈ నెల 26న షేర్ చేయగా, ఇప్పటికే 55 లక్షల మంది చూసేశారు. దీన్ని చూసిన ఓ భారతీయ యూజర్.. ఇండోర్ లో ఫ్లయింగ్ దహీ వడ తయారు చేసే స్ట్రీట్ వెండర్ ఉన్నారంటూ కామెంట్ చేయడం గమనించొచ్చు. ఈ వీడియో చూసిన నెటిజన్లు చెఫ్ నైపుణ్యాలను చూసి అవాక్కవుతున్నారు. అది నైపుణ్యం కాదని, ఆర్ట్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇంత టాలెంట్ కోసం ఎన్ని గంటలు సాధన చేశావురా బాబూ అంటూ మరో యూజర్ కామెంట్ పెట్టాడు.
Street Food Vendor
super talent
cheff
stunning
eye catching
Flying Pizza Dough

More Telugu News