Cricket: అక్షర్ పటేల్‌ను ఢిల్లీ కెప్టెన్ గా నియమించాలంటున్న గవాస్కర్

Gavaskar Wants This Indian Star To Be Named Delhi Capitals Captain
  • హైదరాబాద్ మ్యాచ్ లో బ్యాట్, బంతితో అదరగొట్టిన అక్షర్ పటేల్
  • దీర్ఘకాలంలో ఫ్రాంచైజీకి కెప్టెన్ గా ఎంపిక చేయాలని వ్యాఖ్య
  • టీమిండియాకు ఇది ప్రయోజనం కలిగిస్తుందన్న గవాస్కర్
సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించడం ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2023లో రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ తరఫున ఆడిన అక్షర్ పటేల్ అదరగొట్టాడు. ఓ వైపు బ్యాట్ తో 34 పరుగులు చేయడంతో పాటు బంతితోను మేజిక్ చేసి 2 వికెట్లు పడగొట్టి 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ప్లేయర్ ఆఫ్ ది అవార్డు గెలిచిన అక్షర్ అందరి నుండి ప్రశంసలు అందుకుంటున్నాడు. అక్షర్ కు టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా కితాబునిచ్చారు. స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ తో గవాస్కర్ మాట్లాడుతూ, డేవిడ్ వార్నర్ కు బదులు ఢిల్లీ కెప్టెన్ గా అక్షర్ కు అవకాశమివ్వాలనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.  

'ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ను నియమించాలని నేను భావిస్తున్నాను. అతను హానెస్ట్ ప్లేయర్. మంచి ఫామ్ లో ఉన్నాడు. అతనిని ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా ఎంపిక చేయడం ద్వారా, కెప్టెన్ గా అతని ప్రతిభను చూడటం ద్వారా భారత జట్టు ప్రయోజనం పొందవచ్చు. అయితే ఇది దీర్ఘకాలంలో జరగాలి' అన్నారు. 

రోహిత్ శర్మ విరామం తీసుకోవాలి

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఒత్తిడికి గురవుతున్నట్లుగా కనిపిస్తోందని, అతను ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ గురించి ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తోందని సునీల్ గవాస్కర్ అన్నారు. రోహిత్ కొన్ని ఐపీఎల్ మ్యాచ్ లకు దూరంగా ఉండాలని సూచించారు. అవసరమైతే చివరలో మూడు, నాలుగు మ్యాచ్ లు ఆడాలన్నారు. ఈ సంవత్సరం ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ కు చేరాలంటే ఏదైనా అద్భుతం జరగాలన్నారు.
Cricket
Delhi
Hyderabad

More Telugu News