YS Sharmila: ఆస్తులన్నీ సునీత పేరున బాబాయ్ రాశారు.. ఆస్తుల గొడవే అయితే సునీతను చంపేవాళ్లు: వైఎస్ షర్మిల

YS Vivekananda Reddy kept all assets on Sunitha name says YS Sharmila
  • బాబాయ్ వివేకా చాలా మంచి వ్యక్తి అన్న షర్మిల
  • ఆయన గురించి కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపాటు
  • మన మధ్య లేని వ్యక్తి గురించి తప్పుడు ప్రచారం ఎందుకని మండిపాటు
బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గొప్ప వ్యక్తి అని, మంచి ప్రజా నాయకుడని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ప్రజలందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేశారని చెప్పారు. సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అనేది చూడకుండా ప్రయాణిస్తూ ప్రజల కోసం వెళ్లే వారని అన్నారు. అలాంటి వ్యక్తి గురించి కొందరు వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారాలు చేస్తుండటం దారుణమని అన్నారు. మన మధ్య లేని వ్యక్తి గురించి తప్పుడు ప్రచారం చేయడం సరికాదని, ఇలాంటి కథనాలతో ఆయా సంస్థలు విలువ పోగొట్టుకోవద్దని సూచించారు.

బాబాయ్ తన ఆస్తులన్నింటినీ సునీత పేరు మీద రాయించారని షర్మిల చెప్పారు. అన్ని ఆస్తులూ సునీత పేరు మీదే ఉన్నాయని... ఒకటి, అర ఆస్తులను కూడా సునీత పిల్లల పేరిట వీలునామా రాశారని తెలిపారు. హత్యకు ఆస్తులు కారణం కాదని... ఒకవేళ ఆస్తులే హత్యకు కారణమైతే బాబాయ్ ని కాకుండా సునీతను చంపేవాళ్లని చెప్పారు.
YS Sharmila
YS Vivekananda Reddy
YS Sunitha

More Telugu News