Vardhan: ఆసక్తిని రేకెత్తించేలా 'హీట్' ఫస్ట్ లుక్!

  • కొత్త హీరో హీరోయిన్లతో 'హీట్'
  • సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ
  • దర్శకులుగా అర్జున్ - శరత్ వర్మ పరిచయం
  • సంగీత దర్శకుడిగా గౌతమ్ రవిరామ్
HEAT First Look Poster Released

సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లకు ఎప్పుడూ ఓ క్రేజ్ ఉంటుంది. ఆ జోనర్‌కు సపరేట్ ఆడియెన్స్ ఉంటారు. అయితే ఈ మధ్య మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో ఇంట్రెస్టింగ్ సినిమా హీట్' (ట్యాగ్ లైన్.. ఎ సైకో మైండ్ వర్సెస్ ఎ బ్రోకెన్ హార్ట్)   రెడీ అవుతోంది. త్వరలోనే ఈ సినిమా ఆడియన్స్‌ ముందుకు రానుంది. 

వర్దన్ - స్నేహా ఖుషి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను, ఎం.ఆర్.వర్మ - సంజోష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎం.ఎన్.అర్జున్ - శరత్ వర్మ దర్శకత్వం వహించారు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కించిన ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌ను ..  అలానే హీరో ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. 

ప్రముఖ దర్శకుడు శైలేష్ కొలను చేతుల మీదుగా ఈ టైటిల్ పోస్టర్స్ ను విడుదల చేయించారు. ఈ టైటిల్ పోస్టర్‌తోనే సినిమా థీమ్ ఏంటన్నది చెప్పేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గమనిస్తుంటే .. ఇది ఇన్వెస్టిగేషన్ తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. ఏదో మర్డర్ మిస్టరీగానూ అనిపిస్తోంది. అయితే పోస్టర్‌తోనే ఈ రేంజ్‌లో ఆసక్తిని క్రియేట్ చేయడంలో చిత్రయూనిట్ సక్సెస్ అయింది.

More Telugu News