Vishvaksen: దిల్ రాజు క్లాప్ తో మొదలైన విష్వక్సేన్ కొత్త సినిమా!

  • విష్వక్ నుంచి వచ్చిన 'దాస్ కా ధమ్కీ'
  • ఈ రోజునే పట్టాలెక్కిన కొత్త ప్రాజెక్టు
  • సంగీతాన్ని అందిస్తున్న యువన్ శంకర్ రాజా 
  • కథానాయికగా తెరపైకి అంజలి పేరు
Vishwaksen New Movie Update

విష్వక్సేన్ హీరోగా ఇటీవల వచ్చిన 'దాస్ కా ధమ్కీ' మంచి వసూళ్లను రాబట్టింది. ఆ తరువాత ఆయన నుంచి రానున్న సినిమా, ఈ రోజునే పట్టాలెక్కింది. కెరియర్ పరంగా ఇది విష్వక్ సేన్ కి 11వ సినిమా. దిల్ రాజు క్లాప్ తో ఈ సినిమా షూటింగు లాంఛనంగా మొదలైంది. కృష్ణఛైతన్య ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

నాగవంశీ - సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి టైటిల్ ను ఇంకా ఖరారు చేయలేదు. ఈ కథ ఏ జోనర్ లో నడుస్తుందనే సంగతి కూడా గోప్యంగానే ఉంచారు. విష్వక్సేన్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడనే విషయం మాత్రం అర్థమవుతోంది. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. 

ఇక ఈ సినిమాలో విష్వక్సేన్ సరసన నాయికగా అంజలి కనిపించనుందని అంటున్నారు. అంజలి ఒక వైఫున వెబ్ సిరీస్ లను కవర్ చేస్తూనే, మరో వైపున తెలుగు .. తమిళ .. కన్నడ సినిమాలలోను అవకాశాలను చేజిక్కించుకుంటూ ఉంది. ఆమె కొత్త ప్రాజెక్టులలో ఈ సినిమా కూడా చేరిపోయిందన్న మాట. 

More Telugu News