అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ మళ్లీ వాయిదా.. రేపు విచారిస్తామన్న జడ్జి
- అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పైన కొనసాగుతున్న ఉత్కంఠ
- ఈ రోజు జాబితాలో లేదన్న జడ్జి, రేపు విచారించమన్న న్యాయవాది
- గురువారం సాయంత్రం విచారిస్తామన్న న్యాయమూర్తి
ఈ రోజు కోర్టు ప్రారంభం కాగానే అవినాశ్ రెడ్డి పిటిషన్ పైన విచారణ జరపాలని ఆయన తరఫు లాయర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే ఇవాళ లిస్ట్ లో లేని కేసులపై విచారణ చేపట్టలేమని న్యాయమూర్తి చెప్పారు. గురువారం విచారణ చేపట్టాలని న్యాయవాది కోరగా... అందుకు కోర్టు సమ్మతించింది. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు విచారణ చేపడతామని తెలిపింది.