Parkash Singh Badal: పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ కన్నుమూత

  • ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ప్రకాశ్ సింగ్
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ఆదివారం ఆసుపత్రిలో చేరిక
  • ఈ రోజు రాత్రి కన్నుమూసిన అకాలీదళ్ నేత
Parkash Singh Badal passes away at 95

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్ మంగళవారం రాత్రి కన్నుమూశారు. మొహాలీలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 95 సంవత్సరాలు. ఆయన ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. 

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన ఆదివారం ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఐసీయూలో చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల సమయంలో మృతి చెందారు.

బాదల్ 1970-1971, 1977-1980, 1997-2002, 2007-2017 కాలంలో ముఖ్యమంత్రిగా పని చేశారు. పంజాబ్ లో అత్యంత పిన్న వయసులో ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించింది ప్రకాశ్ సింగ్ బాదలే.

ఈయన గత ఏడాది జూన్ నెలలోను ఆసుపత్రి పాలయ్యారు. కరోనా తదనంతర పరీక్షల కోసం గత ఏడాది ఫిబ్రవరిలోను ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ప్రకాశ్ సింగ్ బాదల్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

More Telugu News