Andhra Pradesh: రేపు ఏపీ ఇంటర్ ఫలితాలు... విడుదల చేయనున్న మంత్రి బొత్స

AP inter results to release tomorrow
  • బుధవారం సాయంత్రం 5 గంటలకు ఇంటర్ ఫలితాల విడుదల
  • పరీక్షలు రాసిన పది లక్షల మంది వరకు విద్యార్థులు
  • అధికారిక వెబ్ సైట్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియేట్ ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి శేషగిరిరావు వెల్లడించారు. మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో సాయంత్రం ఐదు గంటలకు ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తారని తెలిపారు. దాదాపు పది లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. 

విద్యార్థులు bieap.apcfss.in అధికారిక వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇతర వెబ్ సైట్ లలోను ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు, సెకండ్ ఇయర్ పరీక్షలు మార్చి 16 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించారు.
Andhra Pradesh
inter

More Telugu News