Narredy Rajasekhar Reddy: మరోసారి సీబీఐ కార్యాలయానికి వచ్చిన వివేకా అల్లుడు

Viveka son in law Narreddy Rajasekhar Reddy attends at CBI office for the second time
  • వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు
  • వివేకా అల్లుడ్ని మూడ్రోజుల కిందట తొలిసారి ప్రశ్నించిన సీబీఐ
  • నేడు మరోసారి విచారణ
  • లేఖ విషయంపై ప్రశ్నిస్తున్న సీబీఐ!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి మరోసారి సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. మూడు రోజుల కిందటే రాజశేఖర్ రెడ్డిని సీబీఐ ఈ కేసులో తొలిసారిగా విచారించింది. తాజాగా, ఆయనను సీబీఐ మరోసారి తమ కార్యాలయానికి పిలిపించింది. వివేకా హత్య కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. 

వివేకా రాసినట్టుగా భావిస్తున్న లేఖ గురించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. లేఖను సాయంత్రం వరకు ఎందుకు దాచిపెట్టారని ఆయనను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. వివేకా హత్య, తదనంతర పరిణామాల గురించి సీబీఐ ఈ మేరకు వివరాలు సేకరిస్తోంది.
Narredy Rajasekhar Reddy
YS Vivekananda Reddy
CBI
Andhra Pradesh

More Telugu News