Pavan Kalyan: 'వీరమల్లు' కోసం మరోసారి సింగర్ గా మారుతున్న పవన్!

  • షూటింగు దశలో ఉన్న 'వీరమల్లు'
  • పవన్ తో పాట పాడించే ప్రయత్నంలో క్రిష్ 
  • త్వరలో రికార్డు చేయనున్న కీరవాణి
  • కథానాయికగా సందడి చేయనున్న నిధి అగర్వాల్
Hari Hara Veeramallu movie update

పవన్ కల్యాణ్ హీరోగా చేస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమా చాలా రోజులుగా సెట్స్ పైనే ఉంది. క్రిష్ దర్శకత్వంలో ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా, కొన్ని కారణాల వలన ఆలస్యమవుతూ వస్తోంది. ఇక సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను పూర్తిచేసే పనిలో పవన్ ఉన్నారు. ఆ దిశగానే ప్రాజెక్టులో మళ్లీ కదలిక మొదలైంది. 

ఈ సినిమాలో పవన్ కల్యాణ్ తో ఒక పాట పాడించే ఆలోచన క్రిష్ చేశాడట. ఆ పాటను పవన్ పాడితేనే బాగుంటుందని భావించి, ఆయనను ఒప్పించాడని అంటున్నారు. పవన్ కి తగినట్టుగా కీరవాణి ట్యూన్ చేశారని చెబుతున్నారు. సినిమాలో ఒక కీలకమైన సందర్భంలో ఈ పాట వస్తుందని అంటున్నారు. ఈ పాటను రికార్డు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. 

గతంలో పవన్ 'తమ్ముడు' .. ' గుడుంబా శంకర్' .. 'జానీ' .. 'అత్తారింటికి దారేది' .. 'అజ్ఞాతవాసి' సినిమాల కోసం పాడారు. ఆయన పాడిన ఆ పాటలు ఆ సినిమాలకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. అలాగే 'వీరమల్లు' సినిమాలోని పవన్ పాట కూడా ఒక రేంజ్ లో పాప్యులర్ అవుతుందని భావిస్తున్నారు. ఈ  సినిమాలో కథానాయికగా నిధి అగర్వాల్ అలరించనుంది. 

More Telugu News