Rishi Sunak: రిషి సునాక్ ఉత్తరకొరియా అధ్యక్షుడిలా చేస్తున్నాడేంటి?: బ్రిటన్ ప్రజల విమర్శలు

Rishi Sunak mocked compared to Kim Jong Un as he makes cops jog next to his car
  • భారీ కాన్వాయ్‌తో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రయాణం
  • కాన్వాయ్ ముందు రెండు వరుసల్లో సైకిళ్లపై పోలీసులు
  • ‘‘తప్పుకోండి..తప్పుకోండి..’’ అంటూ పాదచారులకు హెచ్చరికలు
  • నెట్టింట వీడియో వైరల్
  • రిషిని చూస్తుంటే ఉత్తరకొరియా అధ్యక్షుడు గుర్తొస్తున్నాడంటూ నెటిజన్ల విమర్శలు
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌పై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిషిని చూస్తుంటే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాన్ ఉంగ్ గుర్తొస్తున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల రిషి సునాక్ భారీ కాన్వాయ్ వెంట రాగా సెంట్రల్ లండన్ మీదుగా వెళ్లారు. కాన్వాయ్‌కు ముందు సైకిళ్లపై రెండు వరుసల్లో వెళుతున్న పోలీసులు ‘‘తప్పుకోండి తప్పుకోండి.. దారి ఇవ్వండి’’ అంటూ రోడ్డుపై నడుస్తున్న ప్రజలను హెచ్చరిస్తూ వెళ్లారు. మరికొందరు పోలీసులు కాన్వాయ్ వెంటే పరుగులు తీశారు. ఈ హంగూ ఆర్భాటం చూసిన ఓ వ్యక్తి ఇదంతా కెమెరాతో రికార్డు చేశాడు. కాన్వాయ్‌లో ఎవరున్నారని అటుగా వెళుతున్న పోలీసులను అతడు ప్రశ్నించగా ప్రధాని రిషి అని వారు సమాధానమిచ్చారు. 

ఈ వీడియో నెట్టింట కాలు పెట్టడంతో రిషి సునాక్‌పై ప్రజలు విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ఇంత ఆర్భాటం అవసరమా?’’ అని ప్రశ్నిస్తున్నారు. కొందరు రిషిని ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌తో కూడా పోల్చారు. కిమ్ కాన్వాయ్ వెంట కూడా ఇలాగే పోలీసులు పరుగులు తీస్తారని చెప్పుకొచ్చారు. కాన్వాయ్‌కు అడ్డొచ్చినవారితో దురుసుగా ప్రవర్తిస్తారని అన్నారు. రిషి కూడా కిమ్ లాగా భారీ వాహనాల్లో ప్రయాణిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.
Rishi Sunak
UK

More Telugu News