Akhil: ఇలాంటి ఒక సినిమా తరువాత నేను ఏమైపోతానో: అఖిల్

  • వరంగల్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • ముఖ్య అతిథిగా వచ్చిన నాగార్జున 
  • సురేందర్ రెడ్డి కాన్ఫిడెంట్ ఇచ్చాడన్న అఖిల్ 
  • తనని ఒక  రేంజ్ లో చూపించాడని వెల్లడి  

Agent Pre Release Event

అఖిల్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఏజెంట్' రెడీ అవుతోంది. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో, ప్రీ రిలీజ్ ఈవెంటును 'వరంగల్' లో నిర్వహించారు. ఈ స్టేజ్ పై అఖిల్ మాట్లాడుతూ .. "రెండేళ్ల పాటు ఈ ప్రాజెక్టుపై పనిచేసినప్పటికీ, అప్పుడే అయిపోయిందా అనిపిస్తోంది. ఆలా ఈ ప్రాజెక్టుతో ఒక బాండింగ్ ఏర్పడిపోయింది" అన్నాడు. 

సురేందర్ రెడ్డి .. నేను ఒక క్రేజీ ప్రాజెక్టు చేయాలనుకున్నాము .. చేశాము. ఆయన ఇచ్చిన ఒక కాన్ఫిడెంట్ వల్లనే ఈ రోజునే ఈ సినిమాను గురించి ఇంతలా మాట్లాడగలుగుతున్నాను. ఈ రేంజ్ లో ఒక సినిమా చేసిన నేను, ఆ తరువాత ఏమైపోతానో అనిపిస్తోంది. అనిల్ సుంకర గారి సపోర్టు ఉండటం వల్లనే ఈ సినిమా ఇంత గొప్పగా వచ్చింది" అని చెప్పాడు. 

సాక్షి వైద్యకి ఇదే ఫస్టు మూవీ అయినప్పటికీ బాగా చేసింది. మమ్ముట్టి గారి వంటి లెజెండ్ తో కలిసి పనిచేయడంబ్ నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం టెక్నీషియన్స్ అంతా కూడా చాలా అంకితభావంతో పనిచేశారు. థియేటర్స్ లో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News