Devi Sri Prasad: చిరంజీవి ఇంట దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ బ్రేక్ ఫాస్ట్

Devi Sri Prasad takes breakfast at Megastar Chiranjeevi residence
  • మెగాస్టార్ నివాసానికి వచ్చిన దేవిశ్రీ
  • బ్రేక్ ఫాస్ట్ విత్ బాస్ అంటూ ఫేస్ బుక్ లో పోస్టు
  • చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపిన వైనం
  • ఆకట్టుకుంటున్న ఫొటోలు
ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి నివాసంలో బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఈ విషయాన్ని దేవిశ్రీనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. బాస్ తో బ్రేక్ ఫాస్ట్ అంటూ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. 

"థాంక్యూ... డియర్ చిరంజీవి సర్... ఎంతో ఆప్యాయంగా అల్పాహారం పెట్టారు... మీతో గడిపిన సమయం అద్భుతం సర్. మీరు ఎప్పుడూ మమ్మల్ని ఏదో ఒక ప్రత్యేకతతో సంతోష పెడుతుంటారు. అందుకే మీరు మాకు ఎల్లప్పుడూ సూపర్ డూపర్ స్పెషల్... లవ్యూ సర్" అంటూ దేవిశ్రీ స్పందించారు. ఈ మేరకు చిరంజీవి నివాసంలో తాను బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న ఫొటోలను కూడా పంచుకున్నారు.
Devi Sri Prasad
Chiranjeevi
Breakfast
Megastar
Tollywood

More Telugu News