Telugudesam: మంత్రి చొక్కా విప్పి ఎందుకు బయటకు వచ్చారు?: అనిత

Vangalapudi Anitha lashes out at YS Jagan
  • జగన్ తన స్వార్థం కోసం ఎస్సీలను బలి పశువులను చేస్తున్నారని వ్యాఖ్య
  • ఎక్కడా బయటకు రాని వైసీపీ నేతలు యర్రగొండపాలెంలోనే ఎందుకు వచ్చారని ప్రశ్న
  • దళిత సెంటిమెంటుతో లాభం పొందాలన్నది జగన్ ఉద్దేశమన్న అనిత
ముఖ్యమంత్రి జగన్ తన స్వార్థం కోసం ఎస్సీలను బలి పశువులను చేస్తున్నారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. కోడికత్తి డ్రామాకు శ్రీనును వాడుకొని జగన్ సీఎం పీఠం ఎక్కారని, ఇప్పడు అదే శ్రీను జైల్లో మగ్గుతున్నప్పటికీ కనీసం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఘటనలో ఉన్నత విద్యావంతుడు, దళిత మంత్రిని చొక్కా విప్పి నడిరోడ్డుపై నిలబెట్టిన ఘనత జగన్ రెడ్డిదేనని వ్యంగ్యం ప్రదర్శించారు.

దళితులను ముందు పెట్టి రాజకీయం చేయడంలో జగన్ కు జగనే సాటి అని ఎద్దేవా చేశారు. యర్రగొండపాలెంకు ముందు మార్కాపురంలో, దానికంటే ముందు గిద్దలూరులో ప్రోగ్రాం జరిగిందని, కానీ ఎక్కడా ఎవరూ చొక్కా విప్పి రోడ్డు మీదకు రాలేదన్నారు. గిద్దలూరు వంటి ప్రాంతాల్లో ఏ రెడ్డి నాయకుడు బయటకు వచ్చి చొక్కా విప్పలేదని ప్రశ్నించారు.

మార్కాపురంలోను ఏ వైసీపీ నేత బయటకు వచ్చి ఎందుకు చొక్కా విప్పలేదని ప్రశ్నించారు. "కేవలం యర్రగొండపాలెంలోనే ఎందుకు జరిగింది... ఎందుకంటే ఇక్కడ ఉన్నది దళిత మంత్రి.. అంటే దళితులను అడ్డం పెట్టుకొని ఈ సెంటిమెంటుతో ముందుకు వెళితే ఆటోమేటిక్ గా వాళ్ళలో వాళ్లు కొట్టుకొని, అందులో నుండి తాము లాభం పొందుతామనేది అత్యాశ" అని అనిత వివరించారు. జగన్ పైశాచిక ఆనందానికి దళితులు బలవుతున్నారన్నారు.
Telugudesam
YS Jagan

More Telugu News