Ashwini Choubey: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్‌ను కీర్తిస్తూ నినాదాలా?.. అలాంటి వాళ్లను కనిపిస్తే కాల్చేయాలి.. కేంద్ర మంత్రి మండిపాటు

  • ‘అతీక్‌ అహ్మద్ అమర్ రహే’ అంటూ బిహార్ లోని పట్నాలో నినాదాలు 
  • ఇలాంటి ప్రకటనలు, నినాదాలు దురదృష్టకరమన్న అశ్విని చౌబే
  • టెర్రరిజం, మాఫియాలను వదిలిపెట్టని ‘యోగి’ మోడల్ బీహార్‌లో అవసరమని వ్యాఖ్య
Union minister wants those raising slogans for Atiq Ahmad to be shot at sight

ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్‌ను కీర్తిస్తూ నినాదాలు చేస్తున్నవారిపై కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే మండిపడ్డారు. అతీక్ అహ్మద్‌ను కీర్తిస్తూ నినాదాలు చేసే వారిని కనిపించిన వెంటనే కాల్చివేయాలని అన్నారు.

బిహార్‌లోని పట్నా జిల్లాలో శుక్రవారం ప్రార్థనల తర్వాత ఒక వ్యక్తి ‘అతీక్‌ అహ్మద్ అమర్ రహే’ అంటూ నినాదాలు చేసిన సంఘటనపై కేంద్ర మంత్రి చౌబే స్పందించారు. ‘‘ఇది విచారకరం. బీహార్‌లో ఇలాంటి ప్రకటనలు, నినాదాలు చేయడం దురదృష్టకరం. అలాంటి వారిని వెంటనే కాల్చివేయాలి’’ అని అన్నారు. 

ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంపై మండిపడ్డారు. దేశ ప్రధానికి, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన తీరు చాలా దురదృష్టకరమని అన్నారు. టెర్రరిజం, మాఫియాలను వదిలిపెట్టని ‘యోగి’ మోడల్ బీహార్‌లో అవసరమని అన్నారు.

‘‘బీహార్‌లో కేవలం మామ-మేనల్లుడి వంశం, కులవివక్ష ప్రభుత్వం నడుస్తోంది. బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ సీఎం నితీశ్‌ కుమార్‌ ప్రకటనలు ఇస్తున్నారు. 2025లో రాష్ట్రంలో యోగి మోడల్‌ను ఎంచుకుని ప్రజలే వారికి సమాధానం చెబుతారు. రాబోయే కాలంలో బీహార్ ప్రజలు యోగి మోడల్‌ను అధికారంలోకి తీసుకువస్తారు. బీహార్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది

More Telugu News