Ravindra Jadeja: సీఎస్కే బౌలర్ పై హర్బజన్ సింగ్ ప్రశంసలు

Ravindra Jadeja didnt bowl even one bad ball vs SRH says Harbhajan Singh
  • జడేజా లైన్ అండ్ లెన్త్ అద్భుతంగా ఉందని మెచ్చుకోలు
  • ఒక్క చెత్త బాల్ కూడా వేయలేదన్న హర్బజన్ సింగ్
  • సన్ రైజర్స్ ఆటగాళ్ల షాట్స్ ఎంపికలను తప్పుబట్టిన మాజీ క్రికెటర్
సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య శుక్రవారం నాటి మ్యాచ్ లో సీఎస్కే బౌలర్ రవీంద్ర జడేజా మెరిశాడు. 4 ఓవర్లు వేసిన జడేజా కేవలం 22 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీసి సన్ రైజర్స్ ను దెబ్బకొట్టాడు. ఇదే మ్యాచ్ లో మతీష్ పతిరణ, ఆకాశ్ సింగ్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి, ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. దీంతో జడేజా బౌలింగ్ పై మాజీ బౌలర్ హర్బజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు.

జడేజా సన్ రైజర్స్ స్టార్ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్ వికెట్లను తీశాడు. మ్యాచ్ తర్వాత స్టార్ స్పోర్ట్స్ తో హర్బజన్ మాట్లాడాడు. ‘‘జడేజా కనీసం ఒక్క చెత్త బాల్ కూడా వేయలేదు. జడేజా లైన్ అండ్ లెన్త్ ఎంతో అద్భుతంగా ఉంది. అతడి బౌలింగ్ లో పరుగులు రావాలంటే బ్యాటర్ ప్రత్యేకంగా ఏదైనా చేయాల్సిందే. అతడు పరుగులు ఇవ్వడు. స్కోర్ కోసం షాట్స్ ఆడాల్సిందే. వారు ఎంపిక చేసుకున్న (సన్ రైజర్స్ ఆటగాళ్లు) షాట్స్ కూడా తప్పే. మయాంక్ అగర్వాల్ చాలా ముందుగా క్రీజు నుంచి వచ్చేశాడు’’ అని హర్బజన్ పేర్కొన్నాడు.
Ravindra Jadeja
Harbhajan Singh
bowl
well

More Telugu News