మరో వివాదంలో ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్
- 2022లో ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ పారితోషికం 226 మిలియన్ డాలర్లు
- స్టాక్‌మార్కెట్ నియంత్రణ సంస్థకు తెలిపిన ఆల్ఫాబెట్
- గూగుల్ ఉద్యోగి సగటు వేతనం కంటే సుందర్ పారితోషికం 800 రెట్లు అధికం
- సంస్థలో లేఆఫ్స్ నేపథ్యంలో చర్చనీయాంశంగా మారిన సుందర్ పారితోషికం
గతేడాది సుందర్ పారితోషికం గూగుల్ సగటు ఉద్యోగి వేతనం కంటే 800 రెట్లు అధికం కావడం సంచలనం కలిగిస్తోంది. సంస్థలో పొదుపు చర్యల పేరిట ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో సుందర్ ఈ స్థాయి పారితోషికం తీసుకోవడం చర్చనీయాంశమైంది.
మరోవైపు, ఈ నెల మొదట్లో లండన్‌లోని గూగుల్ ఉద్యోగులు లేఆఫ్స్‌కు నిరసనగా వాకవుట్ చేశారు. అంతకుమునుపు, జ్యూరిచ్‌లో 200 మంది ఉద్యోగులను తొలగించడంపై ఇతర ఉద్యోగులు నిరసన చేపట్టారు. మొత్తం 12 వేల మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్టు గూగుల్ ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్థికంగా గడ్డు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తొలగింపులు తప్పవని గూగుల్ అప్పట్లో ప్రకటించింది.