NCERT: 1800 మందికిపైగా శాస్త్రవేత్తల లేఖ.. సీబీఎస్‌ఈ పదో తరగతి పాఠ్య పుస్తకం నుంచి డార్విన్ సిద్ధాంతం పాఠ్యాంశం తొలగింపు

  • డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ శాస్త్రవేత్తల లేఖ
  • సీబీఎస్‌ఈ పదో తరగతిలో ‘వారసత్వం-పరిణామం’ పాఠం
  • అభ్యంతరం తెలుపుతూ శాస్త్రవేత్తల లేఖ
  • ‘పరిణామం’ భాగాన్ని తొలగించిన ఎన్‌సీఈఆర్‌టీ
 NCERT Drops Evolution From Class 10 Textbook

12వ తరగతి చరిత్ర పుస్తకం నుంచి మొఘలుల పాలనకు సంబంధించిన పాఠ్యాంశాలను తొలగించిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) తాజాగా పదో తరగతిలోని సైన్స్ పుస్తకం నుంచి డార్విన్ సిద్ధాంతాన్ని తొలగించింది. డార్విన్ ప్రతిపాదించిన శారీరక పరిణామ సిద్ధాంతంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 1800 మందికిపైగా శాస్త్రవేత్తలు, సైన్స్ అధ్యాపకులు, మేథావులు ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. 

టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(టీఐఎఫ్ఆర్), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్‌ఈఆర్), ఐఐటీల శాస్త్రవేత్తలు కూడా సంతకం చేసిన వారిలో ఉన్నారు. ‘బ్రేక్ త్రూ సొసైటీ’ పేరుతో రాసిన ఈ లేఖలో వారు డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని తప్పుబట్టారు. దీంతో పదో తరగతి సైన్సు పుస్తకంలోని ‘వారసత్వం-పరిణామం’ పాఠం నుంచి ‘పరిణామం’ అన్న భాగాన్ని ఎన్‌సీఈఆర్‌టీ తొలగించింది.

More Telugu News