Chandrababu: యర్రగొండపాలెంలో చంద్రబాబు వాహనంపై రాళ్లు... వార్నింగ్ ఇచ్చిన టీడీపీ అధినేత

Chandrababu warns protesters in Erragondapalem
  • ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు
  • యర్రగొండపాలెం రాక
  • మంత్రి ఆదిమూలపు సురేశ్ కార్యాలయం ముందు ఉద్రిక్తత
  • చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే యర్రగొండపాలెం వద్ద ఆయన వాహనంపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో, తన వాహనంలోంచి వెలుపలికి వచ్చిన చంద్రబాబు నిరసనకారులకు వార్నింగ్ ఇచ్చారు. కాగా, ఎన్ఎస్ జీ సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అడ్డుపెట్టి చంద్రబాబుపై రాళ్లు పడకుండా నిలువరించారు. ఇదంతా మంత్రి ఆదిమూలపు సురేశ్ కార్యాలయం ముందే జరిగింది. కాసేపట్లో యర్రగొండపాలెంలో చంద్రబాబు సభ నిర్వహించాల్సి ఉండగా, పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్టు తెలుస్తోంది.
Chandrababu
Erragondapalem
TDP
YSRCP
Prakasam District
Andhra Pradesh

More Telugu News