Facebook: మేమింకా ఇక్కడ ఎందుకు ఉండాలంటూ ఉద్యోగుల ప్రశ్న.. మెటా సీఈఓ సమాధానం ఇదీ!

  • ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాలో వరుస పెట్టి లేఆఫ్స్
  • తాజాగా మరోమారు 4 వేల మంది తొలగింపు
  • గురువారం ఉద్యోగులతో మెటా సీఈఓ వర్చువల్ సమావేశం
  • సమావేశంలో పెల్లుబికిన ఉద్యోగుల ఆవేదన
  • సంస్థలో ఎందుకు కొనసాగాలంటూ సీఈఓకు ఉద్యోగుల సూటి ప్రశ్న
  • కోట్ల మందికి చేరువయ్యే అవకాశం మనదేనంటూ సీఈఓ సమాధానం
Meta employees question ceo zuckerburg why they should stay at meta

ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటాలో విడతల వారీగా జరుగుతున్న తొలగింపుల పర్వం మిలిగిన ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. ఇప్పటివరకూ ఫేస్‌బుక్‌లో 21 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. తాజాగా మరో 4 వేల మందిని తొలగించేందుకు మెటా సిద్ధమైంది. భవిష్యత్తులో మరిన్ని తొలగింపులకు అవకాశం ఉందని కూడా సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన నిర్వహించిన ఓ వర్చువల్ సమావేశంలో ఉద్యోగులు తన గోడును వెళ్లబోసుకున్నారు. 

‘‘మీరు మా నైతికస్థైర్యాన్ని ధ్వంసం చేశారు. అసలు మేము సంస్థలో ఎందుకు ఉండాలి’’ అంటూ ఉద్యోగులు సీఈఓను సూటిగా నిలదీశారు. దీనిపై జుకర్‌బర్గ్ ఏమాత్రం తడుముకోకుండా సమాధానమిచ్చారు. ‘‘మెటా ఓ ప్రత్యేకమైన సంస్థ. వివిధ రకాల ఉత్పత్తులతో అనేక మందికి విభిన్నమైన సామాజిక అనుభూతులను ఇస్తోంది. కోట్ల మందికి చేరువై విస్తృత స్థాయిలో ప్రభావితం చేయాలనుకునే వారికి ఇంతకంటే గొప్ప వేదిక మరొకటి లేదు. మనలాగా సామాజిక స్థాయిలో ప్రజలను ప్రభావితం చేసే సంస్థ మరొకటి లేదు’’ అని జుకర్‌బర్గ్ చెప్పుకొచ్చారు.

More Telugu News